బుద్ధి మారని డ్రాగన్ కంట్రీ.. వెలుగులోకి LACపై కొత్త కుట్ర.. బయటపెట్టిన అమెరికా!
చైనా దురాగతాలను అమెరికా రక్షణ శాఖ మరోసారి బయటపెట్టింది. పెంటగాన్ నివేదిక LACపై చైనా పెరుగుతున్న అణు సామర్థ్యం, నౌకాదళ శక్తి, దళాల బలాన్ని వెల్లడించింది. భారత సరిహద్దుల వెంబడి PLA తన స్థానాన్ని దళాల సంఖ్యను తగ్గించలేదు. ఇప్పటికీ లక్ష మందికి పైగా చైనా బలగాలు భారత సరిహద్దులో మోహరించే ఉన్నాయని పెంటగాన్ పేర్కొంది. ఎంత చెప్పినా బుద్ధి మారని డ్రాగన్ కంత్రీ కంట్రీ.. ఎల్‌వోసీ వెంబడి తన దళాలను ఏమాత్రం తగ్గించలేదని అమెరికా వెల్లడించింది. భారత్‌తో జరిగిన ఒప్పందం మేరకు కొద్దిపాటి సైన్యాన్ని ఉపసంహరించకున్నా, తన బలగాలను యధావిధిగా కొనసాగిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికల పేర్కొంది. జూన్ 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగినప్పటి నుండి, చైనా భారతదేశంతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి సైనిక ఉనికిని కొనసాగించింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని దళాలు ఉపసంహరించుకున్నప్పటికీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తన స్థానాన్ని సైన్యం సంఖ్యను తగ్గించలేదు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2020 ఘర్షణల నుండి PLA తన స్థానాలను, దళాల సంఖ్యను తగ్గించలేదు. LAC వెంట భారీగా బ్రిగేడ్‌ల విస్తరణను నిర్వహించడానికి మౌలిక సదుపాయాలు, సహాయక సౌకర్యాలను నిర్మించింది అని ఈ నివేదిక పేర్కొంది. లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న 3,488 కి.మీ పొడవైన LAC వెంబడి చైనా 1,20,000 మంది సైనికులను మోహరించినట్లు పెంటగాన్ అంచనా వేసింది. చైనా సైనిక దళాలతో పాటు, PLA ట్యాంకులు, హోవిట్జర్‌లు, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, ఇతర అధునాతన సైనిక పరికరాలతో సహా భారీ ఆయుధ వ్యవస్థలను మోహరించింది. LAC పశ్చిమ, మధ్య, తూర్పు సెక్టార్‌లలో 20 కంటే ఎక్కువ కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లు (CABలు) ఫార్వర్డ్ పొజిషన్‌లలో కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది. భారత్‌తో సరిహద్దును పర్యవేక్షించే చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్ భారత్‌తో సరిహద్దు భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని పెంటగాన్ నివేదిక పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో, సరిహద్దు సరిహద్దుల గురించి భారతదేశం – చైనా మధ్య భిన్నమైన అవగాహనలు అనేక వాగ్వివాదాలకు, సైనిక బలగాల సమీకరణకు , సైనిక మౌలిక సదుపాయాలను పెంచడానికి దారితీశాయి” అని నివేదిక పేర్కొంది. కొన్ని CABలు స్థావరానికి తిరిగి వచ్చినప్పటికీ, చాలా మంది సైనికులు అక్కడే ఉన్నారు. ఇది ఈ ప్రాంతంలో చైనా బలమైన ఉనికిని సూచిస్తుందని పెంటగాన్ పేర్కొంది. పెంటగాన్ నివేదిక ప్రకారం తన అణు బలగాలను ఆధునీకరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తుంది. 2024 మధ్య నాటికి, చైనా 600 కంటే ఎక్కువ ఆపరేషనల్ అణ్వాయుధాలను కలిగి ఉంటుందని అంచనా వేసింది. 2030 నాటికి వాటి సంఖ్య 1,000 దాటుతుందని భావిస్తోంది. చైనా అణు ఆయుధాల వైవిధ్యీకరణను పూనుకుంది. ఇందులో తక్కువ సమయంలో ఖచ్చితమైన స్ట్రైక్ క్షిపణుల నుండి బహుళ-మెగాటన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (ICBMలు) వరకు ఆయుధాలు ఉన్నాయి. అనేక రకాల వ్యవస్థలతో కూడిన భారీ వైవిధ్యమైన అణుశక్తిని PLA కోరుకుంటుంది అని పెంటగాన్ నివేదిక పేర్కొంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827