దేశ వృద్ధిలో కీలకంగా మారిన ప్రైవేట్ రంగం.. జీడీపీలో భారీగా పెరిగిన వాటా!
దేశంలో ప్రైవేట్ వినియోగం నానాటికీ పెరుగుతుంది. ఇది ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, గృహ పెట్టుబడులు రెండూ వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే భారత్‌లో కార్పొరేట్ పెట్టుబడులు ఇంకా ఆశించినంతగా పుంజుకోలేదు. అందుకు కారణం ఏమంటే.. న్యూఢిల్లీ, మార్చి 3: దేశ జీడీపీలో ప్రైవేట్ వినియోగం వాటా పెరిగినందున దేశ ఆర్థిక వృద్ధి మరింత సమతుల్యంగా మారుతోందని ఇటీవల విడుదలైన క్రిసిల్ నివేదిక వెల్లడించింది. 2025 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రెండో ముందస్తు అంచనాలో 10 బేసిస్ పాయింట్లు (bps) స్వల్పంగా సవరించి 6.5 శాతానికి చేర్చడం జరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన వాస్తవ GDP వృద్ధి కరోనా మహమ్మారికి ముందు దశాబ్దంలో వచ్చిన సగటు 6.6 శాతానికి చేరువైంది. సవరించిన వృద్ధి గణాంకాలపై క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి మాట్లాడుతూ.. గత ఏడాది వృద్ధిలో 100 బేసిస్ పాయింట్లు పెంచి 9.2 శాతానికి సవరించిన తర్వాత ఈ పెరుగుదల సాధ్యమైందని అన్నారు. సాధారణ రుతుపవనాలు, తక్కువ ఆహార ద్రవ్యోల్బణం, ప్రస్తుత ద్రవ్య చక్రంలో 75-100 బేసిస్ పాయింట్ల రేటు కోతలు వంటి అంశాల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. దేశంలో ప్రైవేట్ వినియోగం నానాటికీ పెరుగుతుంది. ఇది ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, గృహ పెట్టుబడులు రెండూ వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే భారత్‌లో కార్పొరేట్ పెట్టుబడులు ఇంకా ఆశించినంతగా పుంజుకోలేదు. కొనసాగుతున్న సుంకాల యుద్ధాలు, చైనా డంపింగ్ భయం కారణంగా కార్పొరేట్ రంగం పెట్టుబడులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. టారిఫ్‌ల వల్ల వచ్చే నష్టాల సంక్లిష్టత ఇప్పటికే ప్రారంభమైంది. రాబోయే నెలల్లోనూ ఇది కొనసాగే అవకాశం ఉంది. దీంతో మా అంచనాలకు ప్రతికూలతలు సృష్టిస్తుందని జోషి అన్నారు. 2024-25 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) జీడీపీ వృద్ధి 6.2 శాతానికి పెరిగింది. ఇది రెండవ త్రైమాసికంలో సవరించిన 5.6 శాతం నుంచి పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా అంచనా. అయితే 2023-24 ఆర్థిక వృద్ధి రేటును 12 ఏళ్ల గరిష్ట స్థాయి అయిన 8.2 శాతానికి సవరించారు. మరో ముఖ్యమైన పరిణామం ఏమిటంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జనవరి) మొదటి 10 నెలలకు ద్రవ్య లోటు రూ. 11.70 లక్షల కోట్లుగా ఉంది. ఇది వార్షిక లక్ష్యంలో 74.5 శాతంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సానుకూల సంకేతాలను చూపడంలో ప్రైవేట్ వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827