విశాఖ ఏయూలో బంగ్లాలో హిందువులపై దాడుల ప్రభావం.. బంగ్లా స్టూడెంట్స్ గో బ్యాక్ అంటూ నినాదాలు..
బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు, హిందూ నేతల అరెస్ట్ పై మన దేశంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కోల్ కతాలోని ఓ హాస్పటల్ లో బంగ్లదేశీయులకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా.. బంగ్లాలో హిందువులపై దాడుల ప్రకంపనలు ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ఏపీలోనూ వినిపించాయి బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో బంగ్లాలోని హిందువుల క్షేమం కోసం ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రార్ధనలు నిర్వహించింది. హిందువులపై దాడుల వ్యవహారంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలంటూ పలుచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాలో హిందువులపై దాడులకు నిరసనగా ఇటు ఏపీలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. విశాఖలో జనజాగరణ సమితి ఆందోళన బాట పట్టింది. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్స్ వద్ద జన జాగరణ సమితి ఆందోళన చేపట్టింది. ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ విద్యార్ధులను వెంటనే వాళ్ల దేశానికి తిరిగి పంపిచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ విద్యార్థులను భారత ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తుంటే… మనవాళ్లను మాత్రం అక్కడ హింసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జానజాగరణ సమితి సభ్యులు. భారత దేశంలో ఉంటున్న బంగ్లా స్టూడెంట్స్‌ని తిరిగి వాళ్ల దేశానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే బంగ్లా ప్రభుత్వానికి భారతీయుల బాధేంటో అర్ధమవుతుందన్నారు. మొత్తంగా… ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్స్ నుంచి బంగ్లా విద్యార్ధులు వెళ్లేవరకు నిరసనలు చేస్తూనే ఉంటామంటున్నారు జనజాగరణ సమితి సభ్యులు. మరోవైపు జన జాగరణ సమితి నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్ విద్యార్థుల పై నిరసన ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ ఆవేదన తెలియజేప్పందుకేనంటున్నారు ప్రదర్శనకారులు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827