న్యూ ఇయర్ సంబరాల్లో విషాదం.. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 10 మంది మృతి!
అయితే, గతంలో కొన్ని రోజుల క్రితం జర్మనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు నగరమైన మాగ్డేబర్గ్‌లో డిసెంబర్ 20న ఈ దాడి జరిగింది. తాజాగా అమెరికాలో జరిగిన దాడితో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 2025 కొత్త సంవత్సరం ఆరంభంలోనే అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. బుధవారం ఉదయం న్యూ ఓర్లీన్స్ ఫ్రెంచ్ క్వార్టర్‌లోని బోర్బన్ స్ట్రీట్‌లో ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో 10 మంది మరణించారని, మరో 30 మంది వరకు గాయపడినట్టుగా సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనపై ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, గతంలో కొన్ని రోజుల క్రితం జర్మనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు నగరమైన మాగ్డేబర్గ్‌లో డిసెంబర్ 20న ఈ దాడి జరిగింది. తాజాగా అమెరికాలో జరిగిన దాడితో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827